తెలుగు

ఈ డౌన్‌లోడ్ సేవకు మీ పరికరం మద్దతు ఇవ్వనప్పటికీ, డౌన్‌లోడ్ సమాచారాన్ని వీక్షించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కంప్యూటర్‌పై డౌన్‌లోడ్ కోసం డౌన్‌లోడ్‌ల లింక్‌లను ఇ-మెయిల్ ద్వారా పంపబవచ్చు.

COOLPIX P610 ఫర్మ్‌వేర్

మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంచుకోండి.

  • Windows
  • Mac OS

ఈ సాఫ్ట్‌వేర్ నవీకరణ ప్రోగ్రామ్ ఎగువ జాబితా చేయబడిన వినియోగదారు కలిగి ఉన్న పరికరం కోసం (“ప్రభావిత ఉత్పత్తి”), మరియు దిగువ జాబితా చేసిన ఒప్పందాన్ని ఆమోదిస్తే మాత్రమే అందించబడుతుంది. “ఆమోదించాను” ఎంచుకుని, “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం ద్వారా, మీరు ఒప్పందంలోని నిబంధనలు మరియు షరతులను ఆమోదించినట్లు పరిగణించబడుతుంది. డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఒప్పందంలోని నిబంధనలు అర్థం చేసుకున్నట్లు నిర్ధారించుకోండి.

  • • COOLPIX P610 కెమెరాల నుంచి సంస్కరణ 1.3 వరకు ఫర్మ్‌వేర్ అప్‌డేట్ చేయడానికి ఉపయోగించబడే సాఫ్ట్‌వేర్‌ను ఈ సేవ సరఫరా చేస్తుంది. కొనసాగే ముందు, కెమెరా అమర్చు మెనులో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి. పైన జాబితా చేయబడిన ఫర్మ్‌వేర్ ఇప్పటికే వ్యవస్థాపించినట్లయితే మీకు ఈ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ లేదా సంస్థాపించనవసరం లేదు.
  • • ఈ నవీకరణలో మునుపటి నవీకరణలలో చేసిన అన్ని మార్పులను కలిగి ఉంటుంది.
  • • కొనసాగే ముందు కింది సమాచారాన్ని చదవండి.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.2తో పోల్చితే 1.3లో మార్పులు
  • • కింది సమస్యలు పరిష్కరించబడ్డాయి:
    • - విరామ టైమర్ ఫోటోగ్రఫీ 1800 షాట్ల తరువాత ముగించవచ్చు.
    • - చందమామ విధానంలో మూవీలు చిత్రీకరించినప్పుడు కెమెరా విద్యుత్ స్విచ్ కంటే ఇతర నియంత్రణలకు ప్రతిస్పందించవచ్చు.
మునుపటి సంస్కరణలతో పోల్చితే మార్పులు
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.1తో పోల్చితే 1.2లో మార్పులు
  • • హాంగ్ కాంగ్, మకౌవ్ మరియు తైవాన్ దేశాల కోసం ఆసక్తి గల పాయింట్లు (POI) సరిగ్గా ప్రదర్శించని కారణమైన సమస్య పరిష్కరించబడింది.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.0తో పోల్చితే 1.1లో మార్పులు
  • • మానిటర్ మరియు ఎలక్ట్రానిక్ వీక్షణాన్వేషన ప్రదర్శనల మధ్య మారడానికి ఐ సెన్సర్‌ను ఉపయోగించినప్పుడు అరుదైన పరిస్థితులలో, ఈ కింది సమస్యలు సంభవించవచ్చు:
    - చిత్రాలు సరిగ్గా ప్రదర్శించబడవు లేదా సేవ్ చేయబడవు.
    - కెమెరా ఆగిపోవచ్చు.
  • • విరామ టైమర్ ఫోటోగ్రఫీని ఉపయోగించి తీసిన ప్రతి షాట్‌తో మారడానికి ఫోకస్ స్థితి కారణమైన మానవీయ ఫోకస్‌తో ఒక సమస్య పరిష్కరించబడింది.
కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను వీక్షించడం
  1. కెమెరా ఆన్ చేయండి.
  2. మెనులను ప్రదర్శించడానికి కెమెరా MENU బటన్‌ను నొక్కండి.
  3. పట్టిక ప్రతిమలను ప్రదర్శఇంచడానికి బహుళ ఎంపిక సాధనంను ఎడమకు నొక్కండి, ఆపై అమర్చు హైలైట్ చేసి, OK ను నొక్కండి.
  4. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను హైలైట్ చేసి, కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను ప్రదర్శించడానికి OK ను నొక్కండి.
  5. కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి.
  6. కెమెరా ఆఫ్ చేయండి.
ఉత్పత్తి వివరణ
పేరు COOLPIX P610 ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.3
మద్దతు ఉన్న కెమెరాలు COOLPIX P610
మద్దతు ఉన్న ఫర్మ్‌వేర్ సంస్కరణలు సంస్కరణ 1.0–1.2
ఫైల్ పేరు F-P610-V13W.exe
ఆపరేటింగ్ సిస్టమ్
  • Microsoft Windows 10 హోమ్
  • Microsoft Windows 10 ప్రో
  • Microsoft Windows 10 సంస్థ
  • Microsoft Windows 8.1
  • Microsoft Windows 8.1 ప్రో
  • Microsoft Windows 8.1 సంస్థ
  • Microsoft Windows 7 హోమ్ బేసిక్
  • Microsoft Windows 7 హోమ్ ప్రీమియం
  • Microsoft Windows 7 ప్రొఫెషనల్
  • Microsoft Windows 7 సంస్థ
  • Microsoft Windows 7 అల్టిమేట్
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
  1. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో ఒక ఫోల్డర్‌ను రూపొందించండి మరియు దానికి కావలసిన పేరు పెట్టండి.
  2. దశ 1లో రూపొందించిన ఫోల్డర్‌కు F-P610-V13W.exe డౌన్‌లోడ్ చేయండి.
  3. కొత్త ఫోల్డర్‌లో ఒక ఉప-ఫోల్డర్‌ను సంగ్రహించడానికి F-P610-V13W.exe అమలు చేయండి. ఫలిత ఫైల్ మరియు ఫోల్డర్ క్రమానుగతం కింద చూపించబడ్డాయి:
    • firmware (ఉప-ఫోల్డర్ కలిగి ఉన్న ఫర్మ్‌వేర్‌)
    • firmware.bin ("firmware‌" ఫోల్డర్‌లో గుర్తించబడ్డ, కెమెరా ఫర్మ్‌వేర్‌)
  4. కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చేయబడిన మెమరీ కార్డ్‌కు "firmware" ఫోల్డర్‌ను కాపీ చేయండి.
    గమనిక: "firmware" ఫోల్డర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
  5. కెమెరాలోకి మెమరీ కార్డ్‌ను చొప్పించండి మరియు కెమెరా ఆన్ చేయండి.
  6. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
  7. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
  8. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
CPX_MS_FirmUp_Win_En.pdf (PDF) (0.17 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

ఉత్పత్తి వివరణ
పేరు COOLPIX P610 ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.3
మద్దతు ఉన్న కెమెరాలు COOLPIX P610
మద్దతు ఉన్న ఫర్మ్‌వేర్ సంస్కరణలు సంస్కరణ 1.0–1.2
ఫైల్ పేరు F-P610-V13M.dmg
ఆపరేటింగ్ సిస్టమ్
  • macOS High Sierra వెర్షన్ 10.13
  • macOS Sierra వెర్షన్ 10.12
  • OS X 10.11.6
  • OS X 10.10.5
  • OS X 10.9.5
  • OS X 10.8.5
  • OS X 10.7.5
  • Mac OS X 10.6.8
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
  1. F-P610-V13M.dmg డౌన్ లోడ్ చేయండి.
  2. కింది ఫోల్డర్ మరియు ఫైల్‌ను కలిగిన డిస్క్ చిత్రాన్ని మౌంట్ చేయడానికి F-P610-V13M.dmg చిహ్నాన్ని రెండు-సార్లు నొక్కండి:
    • firmware (ఉప-ఫోల్డర్ కలిగి ఉన్న ఫర్మ్‌వేర్‌)
    • firmware.bin ("firmware‌" ఫోల్డర్‌లో గుర్తించబడ్డ, కెమెరా ఫర్మ్‌వేర్‌)
  3. కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చేయబడిన మెమరీ కార్డ్‌కు "firmware" ఫోల్డర్‌ను కాపీ చేయండి.
    గమనిక: "firmware" ఫోల్డర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
  4. కెమెరాలోకి మెమరీ కార్డ్‌ను చొప్పించండి మరియు కెమెరా ఆన్ చేయండి.
  5. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
  6. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
  7. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
CPX_MS_FirmUp_Mac_En.pdf (PDF) (0.14 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందం

PDF ఫైళ్లను ఉచిత Adobe® Reader® సాఫ్ట్‌వేర్ ఉపయోగించి చూడవచ్చు.
Adobe® Reader®ను డౌన్‌లోడ్ చేయండి.